Gold Prices Today : ఊరించడం.. కలవరపర్చడం మామూలే.. ఎంత తగ్గిందని చెప్పాలి?
నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరలపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది
బంగారం ధరలు ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఎక్కువ సార్లు కలవరపెడుతుంటాయి. ధరలు పెరిగినప్పుడు కలవరపడటం, స్వల్పంగా తగ్గినప్పుడు ఊరట చెందడం మానవ బలహీనతగానే చెప్పుకోవాలి. బంగారం ధరలలో అందుకే రోజు హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. ఒకరోజు తగ్గి.. మరొక రోజు భారీగా పెరగడం బంగారానికి అలవాటుగా మారింది. వినియోగదారులు కూడా బంగారం ధరల పెరుగుదలకు పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. పసిడిని ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులుండటంతో ధరల గురించి ఆలోచించడం అనవసరం అని భావిస్తున్నారు.
పెట్టుబడి కోసం...
ప్రధానంగా బంగారంపై పెట్టుబడి పెట్టేవారే ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. కొద్దో గొప్పో డబ్బులు చేతికందితే భూమి కంటే బంగారం బెటర్ అని భావిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. బంగారమయితే భద్రత ఉంటుంది. భూమికి భద్రత ఉండదు. పైగా రిజిస్ట్రేషన్లు అంటూ మళ్లీ విక్రయించిందింగా టెన్షన్ తప్పదు. కానీ బంగారం అలా కాదు.. తమకు అవసరమైనప్పుడు క్షణాల్లో విక్రయించే వీలుండటంతో బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అందుకే పసిడికి డిమాండ్ పెరిగింది.
నేటి ధరలు ఇవీ...
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరలపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,580 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,090 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర మాత్రం 80,200 రూపాయలుగా కొనసాగుతుంది. ఈ ధరల్లో మార్పులు కొంత చోటుచేసుకునే అవకాశముంది.