Gold Rates : పెరగకపోతే ఆనందం కదా.. అంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుంది?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
పసిడి అంటేనే ఎందుకో మగువలకు మక్కువ. అది అంటేనే పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు. బహుమతిగా బంగారు వస్తువు ఇచ్చామంటే చాలు మహిళల మొహాల్లో ఆనందం మరే వస్తువు ఇచ్చినా చూడలేం. బంగారానికి, మగువలకు అలా బంధం చాలా కాలం నాటి నుంచి పెనవేసుకుపోయింది. బంగారు ఆభరణాలు తమ శరీరంపై ఉంటే తమకు మరింత అందాలు సమకూర్చి పెట్టడమే కాకుండా స్టేటస్ సింబల్ గా కూడా ఉంటాయని భావించడమే దీనికి కారణం కావచ్చు.
అనేక కారణాలు...
కానీ బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలలో బంగారం ధరల్లో హెచ్చు, తగ్గుదలలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇజ్రాయిల్ - హమాస్ మధ్య యుద్ధం కారణంగా కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతులు తగ్గించడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా చూడవచ్చు.
స్థిరంగా నేడు...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది మాత్రం బంగారం ప్రియులకు ఊరటకలిగించే విషయమే. ఎందుకంటే పెరగకపోతే చాలు.. అన్నట్లుంది పరిస్థితి. హైదరాబాద్ బులియలన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్ లో మళ్లీ ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,350 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,560 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 78,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.