Gold Price Today : లక్షకు చేరువలో వెండి.. బంగారం ధరలు కూడా ఎగబాకుతాయా?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గుదల అనేది అప్పుడప్పుడే జరుగుతుంటుంది. తగ్గినప్పుడు స్వల్పంగానే బంగారం ధరలు తగ్గుతాయి. అదే పెరిగినప్పుడు మాత్రం భారీగా పెరుగుదల కనిపిస్తుంటుంది. అందుకే పసిడి ధరలు తగ్గాయని మురిసి పోకూడదు. అలాగని పెరిగాయని నిరాశ పడకూడదు. అవసరమున్నంత మేరకు, సమయాన్ని చూసి కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు బంగారం ధరలు కొనుగోలు చేసే సమయం అంటున్నారు. ఎందుకంటే వచ్చే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని, అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
వచ్చే నెల నుంచి...
వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. వరసగా రెండు నెలలు పాటు అధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో పసిడి ధరలకు రెక్కలు రానున్నాయి. వరస ముహూర్తాలతో సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఇప్పుడే పసిడి, వెండి కొనుగోలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో కొందామని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అలసత్వం ప్రదర్శించినా భారీగా పెరుగుదల కనిపిస్తుందని వ్యాపారులు కూడా చెబుతున్నారు. ఇక పెట్టుబడిగా పసిడిని చూసే వారు సయితం ఈ నెలలోనే బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. అందుకే గిరాకీ ఏమాత్రం రెండింటికీ తగ్గడం లేదు.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. అందుకే భారీగా ధరలు పెరగకపోవడం, తగ్గకపోవడంతో ఈరోజు కొనుగోలుకు మంచి సమయం అని చెబుతున్నారు. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,920 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 97,900 రూపాయలుగా కొనసాగుతుంది.