బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర

నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరలపై నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది

Update: 2023-10-09 03:31 GMT

పసిడి అంతే. తగ్గినప్పుడే దానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ధరలు పెరుగుతాయో ఎవరూ అంచనా వేయలేని పరిస్థిితి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతుండటంతో మరింత దిగి వస్తుందని భావించి కొనుగోలుకు వెయిట్ చేసేవారికి బ్యాడ్ న్యూస్. ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు వరసగా తగ్గుతుండటంతో గోల్డ్ లవర్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇంకా తగ్గాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.

ధరలు ఇవీ...
అయితే నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరలపై నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 53,150 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,540 రూపాయలుగా నమోదయింది. వెండి ధర మాత్రం 75,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News