Gold Price Today : బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయిగా.. ఇప్పుడు కొనకుంటే ఇక కొనలేరట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి

Update: 2024-05-19 03:30 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్లే కనిపిస్తుంది. కొద్దిగా తగ్గినట్లు కనిపించినా పెద్దగా తగ్గుదల కనిపించకపోవడంతో పాటు రానున్న కాలంలో భారీగా ధరలు పెరుగుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని, ఇప్పుడు కొనుగోలు చేయడమే మంచిదని సూచిస్తున్నారు.

డిమాండ్ తగ్గని...
బంగారం, వెండి ధరలకు డిమాండ్ తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ రెండింటికీ డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో ధరలు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం పది గ్రాములు ఎనభై వేల రూపాయలకు చేరుకుంటుందని కూడా లెక్కలు చెబుతున్నారు. ఇక వెండి అయితే కిలో లక్ష రూపాయలు దాటుతుందని కూడా అంటున్నారు. పెట్టుబడిగా చూసే వారు మాత్రం ఇప్పుడు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నిలకడగా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. ఇది ఒకరకంగా బంగారం ప్రియులకు ఊరటనిచ్చే వార్త అని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,400 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,620 రూపాయలుగా ఉందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. కిలో వెండి ధర 93,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News