Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎంతున్నాయంటే?
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు ఎప్పుడూ అదుపులో ఉండవు. అవి పైపైకి ఎగబాకుతూనే ఉంటాయి. మల్లెతీగకు పందిరి వేసినట్లుగా పాకుతూ చేతికి అందకుండా తప్పించుకునే పరిస్థితిలో బంగారం, వెండి ధరలు చేరుకున్నాయనడంలో ఎలాంటి సందేహంల లేదు. ఎందుకంటే గత పదేళ్ల నాటికి.. నేటికి బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే అస్సలు ఊహించలేం. 2005లో బంగారం ధరలు 20 వేల వరకూ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే అది ఎనభై వేలకు దగ్గరలో ఉంది. ఎంతగా పెరిగిందో ఈ ధరల పెరుగుదల చూసిన వారికి ఎవరికైనా తెలుస్తుంది. అయితే నాటి ప్రజల కొనుగోలు శక్తి వేరు. నేడు వచ్చిన మార్పులతో కొనుగోలు శక్తి కూడా పెరగడంతో ధరలు పెరిగినా పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు.
సురక్షితమైన పెట్టుబడిగా...
దీంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. గతంలో ఐదు రూపాయలకు విలువ ఉండేది. కానీ నేడు వంద రూపాయలకు కూడా విలువ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బంగారం సేఫెస్ట్ పెట్టుబడిగా అందరూ భావిస్తున్నారు. బంగారం కొనుగోలు చేస్తే ఎప్పటికీ నష్టం అనేది మనం చూడం అన్న భరోసా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంటుంది. అందుకే కొద్దిగా ధరలు పెరిగినప్పటికీ, కొనడం కష్టమయినప్పటికీ కొనుగోలు చేయడం మాత్రం మామూలు అయిపోయింది. దీంతో పాటు గతంలో బంగారానికంటే ప్లాటినం ధర ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్లాటినం ధరలు క్షీణించాయి. బంగారం ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి.
నేడు స్థిరంగా...
అందుకే బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగానే ధరలు కూడా చేరుకుంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు బంగారం ధరలు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,960 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,590 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలకు చేరుకుంది. ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలు. మధ్యాహ్నానికి పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కూడా కొనసాగే వీలుంది.