Gold Prices : బంగారం ధరలు మరింతగా పెరుగుతాయంటున్న నిపుణులు.. ఇప్పుడు కొనలేకపోతే?
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి
బంగారం ధరలు కొత్త ఏడాది మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం, అనేక రకాల కారణాలతో ధరల్లో పెరుగుదల కనిపిస్తుందని చెబుతున్నారు. కొత్త ఏడాది చివరి నాటికి తులం బంగారం డెబ్బయి వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోలు చేయదలచుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
మరింత భారం...
బంగారం ధరలు ఎప్పుడూ అంతే. అందనంత భారంగా మారిపోతుంటాయి. విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యంతో పాటు ఇజ్రాయి్ - పాలస్తీనా, ఉక్రెయిన్ - రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం కూడా బంగారం ధరలపై చూపుతుందని అంటుననారు. దీంతో పాటు డాలర్ తో రూపాయి తగ్గుదల కూడా మరొక కారణంగా చూపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చు తగ్గులు కూడా పసిడి ధరలు భారీగా పెరిగి పోవడానికి మరొక రీజన్ గా చూపిస్తున్నారు.
నేటి ధరలు ఇలా...
అయితే నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. అయితే స్థిరంగా ఉన్నాయని ఆనందపడి పోకూడదని, ఒక్కసారి ధరలు భారీగా పెరుగుతాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,550 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,870 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర మాత్రం 80,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.