Gold Price Today : శ్రావణ శుక్రవారం మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

Update: 2024-08-16 04:02 GMT

శ్రావణమాసంలో బంగారం ధరలు పెరుగుతాయి. ఎప్పుడూ అదే జరిగేది. ఎందుకంటే ఈ సీజన్ లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీదేవి పూజ వద్ద బంగారం కొత్తది కొనుగోలు చేసి ఉంచితే మంచిదని మహిళలు భావిస్తారు. తమకు అష్టయిశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. దీనికి తోడు శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. అందుకే బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వాటి ధరలు కూడా అందకుండా పరుగులు తీస్తాయి. అయినా సరే కొనుగోలు విషయంలో మాత్రం మహిళలు తగ్గకపోవడంతో ధరలు అదుపులోకి రావు.

వారం రోజుల్లో...
కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ బంగారంపై తగ్గించిన తర్వాత బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల్లో పది గ్రాముల బంగారం ధరపై ఏడు వేల రూపాయలు తగ్గిందంటే మామూలు విషయం కాదు. ఈ స్థాయిలో బంగారం ధరలు ఎప్పుడూ తగ్గలేదని చెబుతున్నారు. బంగారం దిగుమతులు తగ్గి, డిమాండ్ పెరిగినా ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న కాలంలో ఇవే ధరలు కొనసాగుతాయని చెప్పలేమంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే బంగారం పెరిగిందంటే భారీ ధరలు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చిన రోజులు అనేకం ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు.
నేడు స్థిరంగా...
ఈరోజు శ్రావణ శుక్రవారం మహిళలకు శుభవార్తగా చెప్పాలి. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,540 రూపాయలుగా కొనసాగుతుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,500 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 88,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు నమోదయిన ధరలు కావడంతో మధ్యాహ్నానికి పెరిగే అవకాశం లేకపోలేదు.


Tags:    

Similar News