Gold Price Today : తగ్గుతున్నాయని సంతోషించకుమా... ఆనందపడేలోపు బంగారం ధరలు భారీ పెరుగుదల ఖాయమట

ఈరోజు దేశంలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.

Update: 2024-09-20 03:44 GMT

gold price today

బంగారం అంటేనే ఇష్టముండనిది ఎవరికి? ప్రతి ఒక్కరూ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో నైనా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి తమకు ఆప్తులైన వారికి బహుమతిగా ఇవ్వాలనుకుంటారు. ఒకప్పుడు పెళ్లిళ్లకు కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు పుట్టిన రోజులకు, కుటుంబంలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారింది. అది ఒక స్టేటస్ సింబల్ గా మారింది. దీంతో బంగారం, వెండికి డిమాండ్ అధికంగా మారింది. అందువల్లనే బంగారం ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయంటారు.

లైఫ్ సేఫ్ గా ఉండటానికి...
పసిడి అంటేనే భారతదేశంలోనే ఎక్కువ ప్రేమ. ఇక్కడే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. భారత్ లో మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఈ గోల్డ్ పిచ్చి మరింత ఎక్కువ. ఎంత ఎక్కువ బంగారం అంటే అంత లైఫ్ సేఫ్ గా ఉంటుందన్న నమ్మకం జనాల్లో పెరిగిపోయింది. పెళ్లిళ్లలో ఎంత బంగారం పెట్టేదానిపైనే అది ప్రధానంగా ఆధారపడి ఉండటం కూడా అనేక ఘటనల్లో చూశాం. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో సీజన్ తో సంబంధం లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. చాలా మంది పెట్టుబడుల కోసం పసిడిని కొనుగోలు చేసి భవిష‌్యత్ కు బాటలు వేసుకునే ప్రయత్నంలో ఉంటారన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణగా వినిపిస్తుంది.
ఈరోజు గోల్డ్ రేట్స్....
అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. పసిడి, వెండి కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యులకు అలివి కాని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దేశంలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,000 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,000 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 95,900 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటల వరకూ నమోదయిన ఈ ధరలు మరింత పెరగవచ్చు. తగ్గవచ్చు. కొనుగోలుదారులు ఇది గమనించాల్సి ఉంటుంి.


Tags:    

Similar News