Gold Price Today : పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఇవాళ బంగారం ధరలు పెరగలేదుగా

నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

Update: 2024-09-29 03:46 GMT

బంగారం అంటేనే కొనుగోలు చేయడం అనేది కష్టంగా మారిపోయింది. బంగారం, వెండి వస్తువులు మన భారతీయ సంస్కృతి ప్రకారం శుభకార్యాలలో వినియోగిస్తారు. ఎక్కువగా మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు మరింత పెరుగుతుండటంతో కొనుగోలుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. బంగారం అనేది నిజంగానే బంగారంగా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పుత్తడి కొనుగోలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అనేక రకాలుగా జ్యుయలరీ దుకాణలు ప్రలోభపెడుతున్నప్పటికీ, ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ పసిడి కొనుగోలుకు చాలా మంది ధరలను చూసి జంకుతున్నారు.

సురక్షితమైన పెట్టుబడి...
బంగారం అంటేనే సురక్షితమైన పెట్టుబడి. దాని ధర పెరిగేదే కాని తగ్గేది అనేది ఉండదు. తగ్గినా స్వల్పంగానే తగ్గుతుంది. మనం కొనుగోలు చేసిన ధరకు, బంగారం మనకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం తెచ్చిపెట్టదు. అందుకే ఇది సేఫెస్ట్ అని అందరూ భావిస్తారు. సులువుగా మార్చుకునే వీలుంది. నగదుగానే కాకుండా కొత్త డిజైన్లు వచ్చినప్పుడు పాత బంగారు ఆభరణాలు ఇచ్చి కొత్త వాటిని కొనుగోలు చేయవచ్చు. అన్ని రకాల వెసులుబాటు ఒక్క బంగారం, వెండి వస్తువులలో మాత్రమే ఉంది. దీంతో పాటు కూడా అవసరాల నిమిత్తం కుదువ పెట్టినా కూడా తక్కువ వడ్డీకి రుణాన్ని పొందే అవకాశాలు అనేక కంపెనీలు కనిపిస్తుండటమే డిమాండ్ పెరగడానికి కారణం.
నేడు స్థిరంగా ధరలు...
బంగారం వల్ల నష్టపోయిన వారు ఇంత వరకూ లేరు. అలాగే లాభపడిన వారు ఎందరో ఉన్నారు. ఎందుకంటే బంగారాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ధరలు పెరిగినా బిందాస్ గా ఉన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు ఇలా ఉన్నాయి. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ధరలు పెరగకుండా నిలకడగా ఉండటాన్ని వినియోగదారులు కూడా ఆహ్వానిస్తున్నారు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,950 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,400 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 1,01,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News