Gold Prices : బంగారం ధరలు తగ్గాయ్ బాసూ.. అయితే ఎంత అని మాత్రం అడక్కండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి
బంగారం ధరలు తగ్గితే ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేం. కొనలేకపోయినా.. తమకు అవసరం లేకపోయినా.. బంగారం ధర తగ్గిందన్న వార్త చాలు ఎంతో రిలీఫ్ ను ఇస్తుంది. భవిష్యత్ లో తాము కొనుగోలు చేసేందుకు ధరలు తగ్గాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే మానవ బలహీనత. అందుకే బంగారం ధరలపై ఎప్పుడూ మహిళల దృష్టి ఉంటూనే ఉంటుంది. వాటి ధరల గురించి ఎప్పటికప్పడు తెలుసుకుంటారు. కొనుగోలు చేయాల్సిన సమయం వస్తుందని వారి నమ్మకం కావచ్చు.
ట్రెండ్ ను అనుసరించి...
అందుకే బంగారం ధరలు బులియన్ మార్కెట్ లో ఎలా ట్రెండ్ అవుతున్నాయన్నది నిత్యం చూస్తూనే ఉంటాం. ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. తక్కువ సార్లు ధరలు తగ్గడం, ఎక్కువ సార్లు పెరగడం బంగారం విషయంలో మామూలుగానే జరుగుతుంది. విదేశాల్లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ యుద్ధాలు కూడా బంగారం ధరల్లో మార్పులు చేర్పులు తెస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతూనే ఉంటారు.
ధరలు ఈరోజు మార్కెట్ లో...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 110 రూపాయలు తగ్గింది. నిన్నటి వరకూ ధరలు పెరగడంతో ఒకింత ఆందోళనలో ఉన్న కొనుగోలుదారులకు స్వల్పంగా తగ్గినా ఊరట కల్గించే అంశమే. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,050 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,330 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం మూడు వందల రూపాయలు తగ్గి 78,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.