Gold Price Today : శుభవార్త.. బంగారు కొనాలనుకునే వారికి ఈరోజు బెస్ట్ డే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది

Update: 2024-08-30 02:26 GMT

పసిడి అనేది అందరి వస్తువు కాదు. కొందరికే అది సొంతంగా మారుతుంది. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి తప్పనిసరి సరి స్థితిలో బంగారాన్ని కొనుగోలు చేయాల్సి రావడం సరే సరి. అదీ మన దేశంలోనే అది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ గోల్డ్ బాండ్స్, గోల్డ్ బిస్కెట్ల కంటే బంగారు ఆభరణాలవైపు ఎక్కువ కొనుగోలు దారులు మొగ్గు చూపుతారు. అందుకే జ్యుయలరీ దుకాణాలు వీధికొకటి వెలిశాయి. భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

సులువుగా నగదును...
ిఇక బంగారం కొనుగోలు చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయి. బంగారం ఇంట్లో ఉంటే స్టేటస్ సింబల్ తో పాటు జీవితానికి భద్రత కూడా ఉంటుంది. వ్యాపారులు, వ్యవసాయదారులు తమకు కావల్సిన సమయంలో తక్కువ వడ్డీకి బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో కుదువపెట్టి డబ్బులు సర్దుబాటు చేసుకునే వీలుంది. అందుకే బంగారానికి మధ్యతరగతి ప్రజల నుంచి అందరూ ఆకర్షితులవుతున్నారు. కష‌్టకాలంలో ఆదుకునే ఏకైక వస్తువుగా బంగారాన్ని చూస్తారు. పెద్దగా కష్టపడకుండానే నిమిషాల్లో నగదు మన చేతుల్లోకి వస్తుంది. అందుకే ప్రతి రోజూ బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయంటారు. దీంతో పాటు పెట్టుబడిగా చూసేవారు కూడా పెరిగారు.
టుడే గోల్డ్ రేట్స్...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. అందులో చివరి శుక్రవారం కావడంతో బంగారం ధరలు తగ్గడం మహిళలకు నిజంగా శుభవార్తే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,140 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,240 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 93,400 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News