Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు కొంత తగ్గాయ్... కొనుగోలు చేయాల్సిందే మరి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Update: 2024-09-27 03:25 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా, తగ్గినప్పుడు స్వ్పల్పంగా బంగారానికి ఒక అలవాటు. బంగారం, వెండి ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవల కాలంలో వరసగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం, వెండి అంటే ఒక సెంటిమెంట్‌గా మారింది. తమ ఇంట్లో ఎక్కువ ఎంత ఉంటే అది మన భవిష్యత్ కు భరోసాగా ప్రజలు భావిస్తుంటారు. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అదీ ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తుంటారు.

వెంటనే డబ్బులు...
అవసరమైన సమయంలో బంగారాన్ని కుదువ పెట్టి తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకునే వీలుంది. క్షణాల్లో డబ్బులు చేతులో పడతాయి. అందుకే వైద్య, విద్య వంటి ఖర్చులకైనా బంగారం, వెండి పొదుపు చేసుకుంటే భవిష్యత్ లో తమ చిన్నారుల చదువుకు కూడా ఉపయోగపడతాయని, రుణాలు అధిక వడ్డీకి తీసుకుని ఇబ్బంది పడే కంటే, బంగారాన్ని కుదువ పెట్టడం ఒక అలవాటుగా ప్రజలు మార్చుకున్నారు. అందుకే బంగారానికి భారతదేశంలో అంత డిమాండ్ పెరిగింది. ఎంత బంగారమున్నప్పటికీ చాలదు. డబ్బులుంటే చాలు కొనేస్తే స్టేటస్ సింబల్‌గా ఉంటుంది అదే సమయంలో వీలయిన సమయంలో తాకట్టు పెట్టుకునే వీలుందని గోల్డ్ కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు.
శుభసూచకంగా...
బంగారం, వెండి ఇంట్లో ఉంటే శుభసూచకంగా భావించే వారు అనేక మంది ఉన్నారు. వివిధ రకాల ఆభరణాలతో పాటు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,010 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,00,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News