Gold Prices Today : మోజు ఎక్కువ.. ధరల మోత కూడా అంతే.. కొనాలంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై నూట యాభై రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి
బంగారం ధరలు పెరుగుతాయని భావించిన వారందరికీ నేడు గుడ్ న్యూస్. ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన పసిడి ధరలు ఈరోజు మాత్రం తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. కొనుగోళ్లు కూడా ఎప్పుడూ అలాగే ఉంటాయి. డిమాండ్ కు తగినట్లుగా బంగారం దిగుమతులు లేకపోవడంతో సహజంగానే ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే అనేక కారణాల వల్ల అప్పుడప్పుడు ధరలు తగ్గుతుంటాయి.
డిమాండ్ ఎక్కువగా...
బంగారం అంటే మోజు పడని మహిళలు ఉండరు. అది ఉంటే చాలు ఇక ఏమీ అక్కరలేదనుకునేవాళ్లు అనేక మంది ఉన్నారు. ఇందులో పేద, ధనిక అంటూ తేడా లేదు. అందరూ బంగారం అంటేనే ఎగబడి కొనేస్తుంటారు. పసిడి ఇంట్లో ఎంత ఉంటే అంత మంచిదన్న భావన ప్రతి భారతీయ మహిళలో ఉండటం కారణంగానే బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. అందుకే గత కొద్ది రోజుల నుంచి ధరలు పెరిగి పేద, సామాన్యులకు భారంగా మారాయి. వారు కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థిితి ఏర్పడింది.
కొంచెం తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై నూట యాభై రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,950 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,220 రూపాయలుగా నమోదయి ఉంది. కిలో వెండి ధర మాత్రం 75,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.