Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం వెంటనే కొనుగోలు చేసేయండి ఇక
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. గతంలో ఉన్న ధరకు నేడు మార్కెట్ లో ఉన్న ధరకు అసలు పొంతన ఉండటం లేదు. తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారికి నిరాశ మిగులుతుంది. గ్రాము బంగారం కూడా కొనాలంటే గగనమే అవుతుంది. అంతగా ధరలు పెరిగిపోయాయి. గతంలో బంగారం ధరలు కొంత వరకూ అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతగా ధరలు పెరిగి వినియోగదారులను భయపెడుతున్నాయి.
కొంచెం శాంతించి...
బంగారం ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరగడానికి అనేక కారణాలున్నాయి. విదేశాల్లో నెలకొన్న మాద్యం, యుద్ధం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనపడుతున్నాయి. బంగారం ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించినప్పటికీ కొద్ది రోజుల పాటు ధరలు తగ్గినట్లే కనిపించి మళ్లీ పెరుగుతున్నాయి. ఒక రోజు ధరలు స్వల్పంగా తగ్గితే.. ఎక్కువ రోజులు ధరలు భారీగా పెరుగుదల కనిపిస్తుంది. దీంతో కొనుగోళ్లు కూడా దాదాపు ఇరవై శాతం మేరకు తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
స్వల్పంగా తగ్గి...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ధరలు పెరుగుతాయని భావించే వారికి నేడు గుడ్ న్యూస్ అందింది. బంగారం, వెండి ధరలు పెరగలేదు. నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు 80,280 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలకు చేరుకుంది.