Gold Rates Today : కొద్ది రోజులుగా అదే రకంగా మార్పు... ఎందుకనో?

నేడు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి

Update: 2024-02-23 03:38 GMT

బంగారం ధరలు పెరిగాయంటే ఇప్పుడు సర్వసాధారణమయి పోయింది. ఎంత పెరిగాయని చూడటం తప్ప పెద్దగా నోరు వెళ్ల పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే బంగారం ధరల పెరుగుదలకు కొనుగోలుదారులు అలవాటు పడ్డారు. పెరిగినా, తగ్గినా తమ అవసరాల కోసం కొనుగోలు చేయక తప్పని పరిస్థితులు ఉండటంతో బంగారం ధరల విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ధరలు పెరుగుదలతో సంబంధం లేకుండానే కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి.

పెరిగినా.. తగ్గినా...
అయితే పసిడి ధరలు పెరిగినా, తగ్గినా వినియోగదారులకు ఒరిగేదేమీ లేదు. పెరిగినప్పుడు భారీగా, తగ్గినప్పుడు స్వల్పంగా ధరలుండటంతో కొనుగోలు దారులు తమ దృష్టి అంతా జ్యుయలరీ పైనే ఉంటుంది. అంతే తప్ప ధరలపై ఉండటం లేదు. బంగారం, వెండికి ఎంత మాత్రం గిరాకీ తగ్గదు. పసిడికి వన్నె తగ్గనట్లే ధరలు కూడా తగ్గే అవకాశం లేదు. వెండి కూడా అంతే. రెండు భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైన వస్తువులుగా మారాయి. స్టేటస్ సింబల్ గా మారడంతో వాటికి డిమాండ్ ఎప్పుడూ పడిపోదు.
రెండు వస్తువులూ...
నేడు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. గత కొద్ది రోజులుగా ఇదే రకంగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,490 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,720 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 76,400 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News