Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి అలెర్ట్.. కొనుగోలు చేయాలంటే?
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు ఎప్పడూ ఒకలా ఉండవు. ప్రతి రోజులో ఉదయం, మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. అనేక కారణాలతో ధరల్లో పెరుగుదల, తగ్గుదల కనిపిస్తుంది. అయితే ఎంత పెరుగుతుందన్నది ముందుగా అంచనా వేయలేం. అలాగే పెరిగిన ధరలు ఎంత మేరకు తగ్గుతాయన్నది కూడా ముంుదుగా అంచనా వేసి చెప్పలేం. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడానికి పెద్దగా ధరలను చూడకపోవడం అందరూ పాటించే నియమం. తమ అవసరాలకు తగినట్లుగా బంగారాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారు. అలాగే ధరలు ఎక్కువగా ఉంటే అవసరమైనంత మేరకే కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది సిద్ధపడుతుంటారు.
కొనుగోలు చేయడం...
పెళ్లిళ్లు అయినా సరే ధరలను బట్టి కొనుగోళ్లను చేయడం ఇటీవల అలవాటుగా మారింది. పెళ్లికి ముందు కుదిరిన ఒప్పందం మేరకు కొనుగోలు చేయడం కొందరు చేస్తుంటారు. అలాగే మరికొందరు ధరలు తక్కువగా ఉంటే ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసి వరుడిని ఆశ్చర్యపర్చడానికి సిద్ధమవుతారు. కానీ అలాంటి ఘటనలు చాలా అరుదుగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మహిళలు జ్యుయలరీ దుకాణాలకు వచ్చారంటే అనేక రకాలుగా బేరమాడటం, తరుగుదల, డిస్కౌంట్ వంటి వాటి విషయాలపై ఎక్కువగా పట్టుబడుతుంటారని వ్యాపారులు చెబుతున్నారు. కానీ తమకు నచ్చిన బంగారు ఆభరణాన్ని మాత్రం కొనుగోలు చేయకుండా షాపు నుంచి కాలు బయటపెట్టరు.
నేటి ధరలు ఇలా...
అలాగే బంగారం ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటల వరకే నమోదయినవి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు, చేర్పులు జరగవచ్చు. ధరల పెరగవచ్చు. తగ్గవచ్చు. నిలకడగా ఉండే అవకాశాలూ ఉన్నాయి. నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,790 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,410 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.