Gold Price Today : దీపావళికి ముందు తీయటి వార్త.. బంగారం ధరలు తగ్యాయోచ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి.

Update: 2024-10-25 03:27 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది అరుదు. అలాగే నిలకడగా ఉండటం కూడా తక్కువ సార్లే. ఎందుకంటే బంగారం అంటేనే ప్రియమైన వస్తువుగా మారిపోయింది. దానికి ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరగడమే తప్ప తరగడం అనేది ఉండదు. బంగారం, వెండి అంటేనే అతి విలువైన వస్తువులుగా మారిపోయాయి. ధరలు గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగాయి. ఒకనాడు అందరికీ అందుబాటులో ఉండే బంగారం, డిమాండ్ అధికమవ్వడంతో ఇప్పుడు కొందరికే సొంతమవుతుంది. ఎక్కువ మందికి భారంగా మారుతుంది. బంగారం దుకాణాలకు వెళ్లాలంటే జంకే పరిస్థితి నేడు ఏర్పడింది.

ఊహించని స్థాయిలో...
ఎందుకంటే పసిడి ధరలు ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొనాలన్నా స్థోమత సరిపోవడం లేదు. అయితే మన సంప్రదాయంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటంతో విధిగా కొందరు తప్పని సరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయినా ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లు కూడా ఇరవై శాతం వరకూ తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ధరలు పెరుగుదల చూసి కొనేవారు కరువయ్యారంటున్నారు. దీపావళితో పాటు థన్‌తెరాస్ కూడా ఉండటంతో రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిసి కూడా ఎవరకూ కొనుగోలుకు ముందుకు రావడం లేదు.
సురక్షితమైన పెట్టుబడిగా...
అయితే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించే వారు మాత్రం ధరలను చూడటం లేదు. బంగారం కొంటే గ్యారంటీ లాభమే. నష్టమనేది ఉండదన్న భావన బలపడిపోవడంతో కొందరు అదేపనిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 72,840 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 79,460 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 101,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News