Gold Price Today : మహిళలూ ఇది మీ రోజే.. గుడ్ న్యూస్.. బంగారం కొనేసేయండి మరి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలలో కూడా అదే స్థాయిలో తగ్గుదల కనిపించింది

Update: 2024-09-03 03:32 GMT

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అన్ సీజన్ అని అనుకోవాలో? మరే ఇతర కారణాల వల్లనో తెలియదు కాని గత కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇది నిజంగా కొనుగోలుదారులకు శుభవార్తే. నిజానికి ఇప్పుడు మరో నెల రోజుల పాటు ముహూర్తాలు లేవు. ఇక అక్టోబరు నెలలోనే పెళ్లిళ్లు, శుభముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. అప్పటి వరకూ బంగారం కొనుగోలు చేయడానికి మధ్యతరగతి ప్రజలు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అయితే ధరలు తగ్గినప్పుడు ముందుగా శుభకార్యాలకు డేట్ ఫిక్స్ చేసుకున్న వాళ్లు కొనుగోలు చేసే అవకాశముండటంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు వివిధ రకాల డిజైన్లతో సిద్ధంగా ఉన్నారు.

పసిడి అంటేనే...
పసిడి అంటేనే మహిళలు ఫిదా అవుతారు. చీరలను, డ్రెస్ లను ఎంత ఇష్టపడతారో అంతకంటే ఎక్కువ మక్కువ బంగారంపైనే ఉంటుంది. ఈ మాత్రం చిన్న అవకాశం దొరికినా బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెనుకాడరు. డబ్బులుంటే వెంటనే పసిడిని కొనుగోలు చేసేందుకు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడతారు. అది ఎంత అని కాదు. ఎంతో కొంత బంగారాన్ని ఇంటికి తీసుకు రావాలన్న తపన మహిళల్లోనే ఎక్కువగా కనపడుతుంది. అందుకే జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా మహిళలకు సంబంధించిన ఆభరణాల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ డిజైన్లు మారుస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు.
నేటి ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలలో కూడా అదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల యాభై రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై తొమ్మిది వందల రూపాయలు తగ్గింది. ఇటీవల కాలంలో ఇంత భారీగా తగ్గడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 85,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటల వరకే. మధ్యాహ్నం పెరిగే అవకాశముంది. అదే సమయంలో తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కొనుగోలు చేయడం లేదా మీ ఇష్టం.


Tags:    

Similar News