Gold Price Today : మహిళలకు షాకిచ్చిన గోల్డ్ రేట్స్... మంగళవారం ధరలు పెరగడంతో?
ఈర్ోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి.
బంగారం ధరలు ఎప్పుడూ అంతే. ఆశ పెట్టి.. ఊరించి... మరీ కొనుగోలు చేద్దామనుకునేలోపు పెరుగుతుంటాయి. పసిడి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? ఎందుకంటే ఇంట్లో బంగారం, వెండి ఉంటే భద్రత. క్లిష్ట సమయంలో బంగారం చేదోడు వాదోడుగా ఉంటుంది. బంగారం, వెండి వస్తువులను సులువుగా మార్చుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. మంచి ధర వచ్చినప్పుడు విక్రయించడానికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండకపోవడంతో మహిళలతో పాటు అనేక మంది బంగారం కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారానికి మించి లేదన్న భావనలో ఉన్నారు.
సీజన్ లో పెరగడం...
బంగారం అంటే స్టేటస్ సింబల్ గా మారింది. సమాజంలో గౌరవం పెరుగుతుందన్న భావనతో అనేక మంది వీటి కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో ప్రతి నిత్యం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవన్నీపక్కన పెడితే సీజన్ లో బంగారం, వెండి ధరలు పెరగడం ఖాయమని, కొనుగోళ్లు ఎక్కువయితే వాటి ధర కూడా పెరుగుతుందని, ఈ లాజిక్ మిస్ కావద్దని వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు ఇవే...
ఈర్ోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై ఆరు వందల రూపాయలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెప్పాయి. నిన్న పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల యాభై రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,590 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర భారీగా తగ్గి 78,900 రూపాయలుగా కొనసాగుతుంది. నిన్న కిలో వెండి ధరపై ఆరు వందల రూపాయలు తగ్గింది.