Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి

Update: 2024-08-21 03:02 GMT

దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు స్థిరంగా ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే పసిడి ధరల్లో మార్పులకు అనేక కారణాలుంటాయి. వాటి కారణాలను చెప్పుకునే దానికన్నా ప్రతి రోజూ డిమాండ్ ఎక్కువగా ఉండేది బంగారం మాత్రమే. ఎందుకంటే అది వన్నె తగ్గనట్లే. దానికి విలువ తగ్గదు. అనేక మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడానికి ఇదే కారణం. ధనవంతుల నుంచి పేదల వరకూ బంగారం, వెండి కొనుగోలు చేయడానికి తహతహలాడుతుంటారు. తమకు ఉన్న ఆర్థిక శక్తి మేరకు కొనుగోలు చేస్తుండటంతో బంగారానికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుంది.

దక్షిణ భారతదేశంలో...
ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నప్పటికీ భారత్ లో ఇది ఎక్కువగా కనపడుతుంది. అందులోనూ దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇక శ్రావణమాసం కావడం, పెళ్లిళ్లు జరుగుతుండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది. కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. బంగారం దిగుమతులు అంతే ఉండగా కానీ రోజురోజుకూ దాని అవసరం కోసం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పసిడి ధరలు ఎప్పుడూ పరుగులు తీస్తుంటాయి. పసిడికి తోడు వెండి కూడా అదే బాటలో పయనిస్తుంటుంది. రెండువస్తువులను స్టేటస్ సింబల్ గా భావించడమే ఇందుకు ప్రధాన కారణం.
వెండి పెరిగి.. బంగరం తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72.640 రూపాయలకు చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక కిలో వెండి ధర 92,100 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News