Gold Prices : అనుకున్నదే జరుగుతుంది... పెరిగితే మాత్రం మామూలుగా ఉండదు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 320 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి
పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. తగ్గితే వార్త కాని, పెరిగితే ఇప్పుడు కొనుగోలుదారులకు పెద్దగా వార్త కాదు. అలా అలవాటు పడిపోయారు. బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత ప్రియం కావడం ఖాయమని ముందునుంచే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్లతో పాటు కార్తీక మాసంలో పసిడి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని అందరూ ఊహించారు. దీనికి తోడు డిమాండ్ తగినట్లు బంగారం నిల్వలు దేశంలో లేకపోవడం కూడా ధరలు పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
ధరలతో సంబంధం లేకుండా...
పసిడిని ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. తగ్గినప్పుడు స్వల్పంగా, పెరిగినప్పుడు భారీగా పెరగడం కూడా బంగారానికి అలవాటు అనే చెప్పాలి. మధ్య తరగతి ప్రజలు స్కీమ్‌ల ద్వారా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. జ్యుయలరీ దుకాణాలు కూడా స్కీమ్ లను ఎక్కువగా ప్రోత్సహిస్తూ తమ అమ్మకాలను పెంచుకుంటున్నాయి. అందుకే బంగారం దుకాణాలు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. ఏదో చిన్న పాటి వస్తువునైనా కొనుగోలు చేస్తే మనకు ఉపయోగమన్న భావన జనంలో ఉండటమే ఇందుకు కారణం.
భారీగా పెరిగిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 320 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,100 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,290 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 80,200 రూపాయలుగా ట్రెండ్ అయింది.