Gold Prices : మరో మూడు నెలలు పెరుగుతూనే ఉంటాయట.. గుండె దిటవు చేసుకోవాల్సిందే
దేశంలో ఈరోజు బంగారం ధరలు మరింతగా పెరిగాయి. వెండి ధరలు కూడా పరుగులు పెట్టాయి
బంగారానికి మెరుపు ఎంతగా ఉంటుందో... అదే తరహాలో వేగంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. పసిడి ధరలను అదుపు చేయడం సాధ్యం కాని పరిస్థితి అని తేలిపోయింది. కొత్త ఏడాది మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాటలు అక్షరసత్యాలుగా మారనున్నాయి. బంగారం ధరలు ఇక పెరగడమే తప్ప భారీగా తగ్గడం అంటూ పెద్దగా జరగని పని. తగ్గితే స్వల్పంగానో, లేకుంటే స్థిరంగానో కొనసాగుతాయి తప్ప పెరగవని భావించడం మాత్రం అత్యాశే అవుతుంది.
పెళ్లిళ్ల సీజన్ ...
పెళ్లిళ్ల సీజన్ ఇంకా ముగియలేదు. మార్చి నెల వరకూ పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. మార్చి తర్వాత కొద్ది నెలల పాటు వివాహాది శుభకార్యాలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో తగ్గితే బంగారం ధరలు స్వల్పంగా తగ్గవచ్చేమో కానీ ఈ మూడు నెలలు మాత్రం పసిడి పరుగులు తీస్తూనే ఉంటుంది. దాని వెంట పరుగులు పెట్టడం కొందరికే సాధ్యమవుతుంది. కొందరికే బంగారాన్ని కొనుగోలు చేసే శక్తి ఉంటుంది. అందరూ పసిడిని కొనుగోలు చేయలేని పరిస్థితులు ఇప్పటికే వచ్చాయి. ఈ పరిస్థితి మరింత తీవ్రం కానుంది.
నేటి ధరలు ఇలా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు మరింతగా పెరిగాయి. వెండి ధరలు కూడా పరుగులు పెట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,750 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,090 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం 80,300 రూపాయలుగా నమోదయింది.