Gold Price Today : మళ్లీ ఎనభై వేలకు చేరుకున్న బంగారం ధరలు.. ఇక పెరగడమేనా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

Update: 2024-10-27 03:49 GMT

బంగారం ధరలపై ఎవరి నియంత్రణ ఉండదు. వాటి ధరల్లో మార్పు ప్రతి రోజూ జరుగుతుంటుంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని తగ్గించినప్పటికీ ధరల పెరుగుదల ఆగడం లేదు. కొన్ని రోజుల పాటు ఆ ఎఫెక్ట్ కనిపించినట్లే కనిపించి తిరిగి మాయమైంది. మళ్ల ీపూర్వ స్థితికి చేరుకుంది. అంతర్జాాతీయ ధరల్లో మార్పులు, చేర్పులు, విదేశాల్లో నెలకొన్న ద్రవ్యోల్బణం, అమెరికా ఎన్నికలు, యుద్ధాలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. ప్రతి రోజూ మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. అవి పెరగొచ్చు. తగ్గొచ్చు. లేక స్థిరంగా కొనసాగవచ్చు.

మరింత డిమాండ్...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయింది. దీంతో బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. పసిడికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. గత కొన్ని దశాబ్దాలనుంచి జనరేషన్‌లు మారినా పసిడిపై ప్రేమ మాత్రం తగ్గలేదు. అది పెరుగుతూనే పోతుంది తప్ప తరగడం లేదు. దీంతో ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. బంగారంతో పాటే వెండి ధరలు కూడా మరింతగా పెరుగుతున్నాయి. బంగారం, వెండి వస్తువులంటే పడి చచ్చిపోయే మహిళలు వాటిని ఎంత ధరపెట్టైనా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. పేరుకు పది గ్రాముల బంగారం ధర ఎనభై వేలు అయినా తరుగు, జీఎస్టీ, ఇతర పన్నులుతో దాదాపు 90 రూపాయలు పలుకుతుందని వినియోగదారులు చెబుతున్నారు.
నిలకడగా నేడు...
బంగారం అంటే సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల దీనికి మరింతగా డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి రోజూ కొత్త కొత్త ఆభరణాలను జ్యుయలరీ దుకాణాలు పరిచయం చేస్తుండటంతో పసిడిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,600 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,290 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,07,000 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News