Gold Price Today : హమ్మయ్య బంగారం ధరలు పెరగలేదు.. దీనికి ప్రధాన కారణమదే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

Update: 2024-09-01 03:13 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. సీజన్, అన్ సీజన్ అనే తేడా లేదు. బంగారాన్ని కొనుగోలు చేయడం ఒక హాబీగా మార్చుకున్న అనేక మంది కొత్త డిజైన్లు వచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంగారం, వెండికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ గిరాకీ తగ్గని వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే. ప్రతి కుటుంబం కూడా తమ ఇళ్లలో బంగారం ఉండాలని భావిస్తారు. అది ఒక సెంటిమెంట్ గా భావిస్తుండటంతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరగడం కూడా బంగారం కొనుగోళ్లకు ఒక కారణంగా చెబుతుంటారు. ఇక అంతర్జాతీయంగా జరిగే పరిణామాల సంగతి మరొక రీజన్ గా ఉన్నాయి.

ముహూర్తాలు లేకపోవడంతో...
అయితే శ్రావణమాసం గడిచిపోయింది. సెప్టంబరు నెల అంతా మంచి ముహూర్తాలు లేవు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో కొంత గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పాటు వరస పండగలు ప్రారంభం కానుండటంతో ఇంట్లో ఖర్చు కూడా రానున్న కాలంలో పెరుగుతుండటం కారణంగా బంగారం కొనుగోలుకు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు కాస్త బ్రేక్ ఇచ్చారని అంటున్నారు. అయితే బంగారం ధరలు పెరగవని గ్యారంటీ లేదు. పసిడి ఏదో ఒక కారణంతో ధరలు పెరిగి వినియోగదారులను ఉసూరుమనిపిస్తుంటుంది. అయితే కొన్ని సార్లు మాత్రం పుత్తడి, వెండి ధరలలో ఆకట్టుకునే విధంగా పెరుగుదల కనిపించదు.
స్థిరంగా ధరలు...
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు కాస్త విరామం ఇచ్చినట్లు కనపడుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలు ఉంటాయి. తర్వాత మారే అవకాశం ఉండొచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,950 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,040 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 92,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News