Gold Prices Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఆషాఢమయినా సరే కొనేసేయండి
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి
బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి సీజన్ ప్రారంభం కానుండటంతో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆషాఢమాసమయినా బంగారం కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. రాను రాను ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. బంగారం ధరలు వచ్చే నెల నుంచి భారీగా పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
గిరాకీ తగ్గని...
పసిడి, వెండి ఈ రెండు వస్తువులకు గిరాకీ ఎప్పుడూ తగ్గదు. దాని విలువ నిత్యం పెరుగుతూనే ఉంటుంది. బంగారం మెరిసినట్లుగానే ధరలు కూడా అదిరిపోతుంటాయి. రానున్న కాలంలో సామాన్యులకు కూడా ధరలు అందుబాటులో ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వెండి కిలో ధర లక్ష రూపాయలకుచేరుకుంది. బంగారం ధరలు కూడా దగ్గరదగ్గర ఎనభై వేలకు చేరుకునే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. అందుకే ఇప్పుడే బంగారం, వెండిని కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,800 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,3000 రూపాయలకు చేరుకుంది.