Gold Price Today : వరసగా మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. పైపైకి ఎగబాగుతూ?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం అంటేనే ప్రియమైన వస్తువు. ఎప్పటి నుంచో గోల్డ్ అనేది ఒక అపురూపమైన వస్తువుగా మారింది. ఇక ధరలు పెరిగిన నాటి నుంచి సామాన్యులకు ఇది అందకుండా పోయింది. దీనిని దక్కించుకోవాలంటే మామూలు విషయం కాదు. కొనుగోలు చేయాలంటే స్థోమత సరిపోని వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ప్రజల కొనుగోలు శక్తి కొంత పెరగడంతో బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో పెరిగినా సరే కొనుగోళ్లు మాత్రం జరుగుతున్నాయి. పసిడిని తమ ఇంటి వస్తువుగా చూడటమే కాకుండా స్టేటస్ సింబల్ గా భావిస్తుండటంతో ఎక్కువ మంది మహిళలు పసిడి, వెండి కొనుగోలు చేయడానికి ఏమాత్రం సంకోచించరు.
ఆభరణాలకంటే...
దేశంలోనే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక స్పెషల్ డే ఉండనే ఉంటుంది. పుట్టినరోజు కావచ్చు. పెళ్లిరోజు కావచ్చు. ఏదైనా సరే.. ఆ రోజున బంగారం కొనుగోలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. కూడబెట్టుకున్న డబ్బులను బంగారం పైన పెట్టడమే పనిగా పెట్టుకున్నారు కొందరు. మదుపు చేస్తే ఇది భవిష్యత్ లో ఆదుకుంటుందని పసిడిని ఎక్కువ మంది ఆ రూపంలోనూ కొనుగోలు చేస్తుంటారు. వాళ్లంతా గోల్డ్ బిస్కట్ల రూపంలో కొనుగోలు చేస్తారు. ఆభరణాల జోలికి పోరు. ఎందుకంటే అందులో తరుగు, మెరుగు అంటూ చాలా వరకూ నష్టపోతామని స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లను కొనుగోలు చేయడం కొందరు చేస్తుంటారు.
భారీగా పెరిగి...
ఇటువంటి వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా మారింది. అందుకే దేశంలో బంగారం ధరలు ఎప్పుడూ పడిపోవన్న నమ్మకంతో నిత్యం కొనుగోళ్లు జరుపుతుంటారు. అంతే కాదు జ్యుయలరీ దుకాణాలు కూడా సీజన్ తో సంబంధం లేకుండా కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. దీనికి కారణం బంగారం, వెండి కొనుగోళ్లు పెరగడమే. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై ఎనిమిది వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంధర 72,410 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,990 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,05,100 రూపాయలుగా ఉంది.