Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. పరుగులు పెడుతున్న పసిడి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉంటాయి. కొన్ని రోజులు తగ్గినట్లే కనిపించిన బంగారం ధర తిరిగి పరుగు ప్రారంభించింది. సీజన్ ప్రారంభమయ్యే దాని కంటే ముందుగానే పరుగు అందుకుందంటే.. ఇక సీజన్ లో ధరలు ఎలా ఉంటాయన్నది చెప్పకనే తెలుస్తుంది. ఇది ట్రయల్ మాత్రమేనంటున్నారు మార్కెట్ నిపుణులు. బంగారం కొనుగోళ్లు ఎక్కువగా పెరుగుతుండటంతో పాటు అనేక కారణాలతో ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆధునిక సమాజంలోనూ గోల్డ్ అంటే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం అనేది జరగడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తగ్గిందని సంతోషించడంకంటే పెరిగిందని బాధపడటమే ఎక్కువసార్లు చేయాల్సి ఉంటుంది.
కళ్లెంపడే...
దూసుకుపోతున్న బంగారం ధరలకు ఇక కళ్లెం పడే అవకాశాలేలేవన్నది వ్యాపారుల మాటగా వినిపిస్తుంది. ఎందుకంటే రాను రాను బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పసిడి అంటేనే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. అది తమ వద్ద ఉంటే గౌరవం మరింత పెరుగుతుందని భావిస్తారు. అందుకోసమే బంగారం కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీంతో పాటు కష్టకాలంలో సులువుగా తాకట్టు పెట్టుకుని తమ కష్టాలు తీరిన తర్వాత తమ పసిడిని తాము పొందే అవకాశం కూడా దీనికే ఉంది. అందుకే ఎక్కువ మంది తమకు ఉన్నదాంట్లో సొమ్ము దాచుకుని మరీ బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
భారీగా పెరిగి...
ప్రధానంగా కరోనా వంటి క్లిష్ట సమయాల్లో పసిడి ఎంతమందికో ఆర్థికంగా ఉపయోగపడింది. ఉపాధి అవకాశాలు లేని సమయంలో బంగారం ఆదుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,100 రూపాలయకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,370 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 97,900 రూపాయలుగా నమోదయింది.