Gold Price Today : షాకింగ్ న్యూస్...77వేలు దాటిన గోల్డ్.. లక్ష రూపాయలకు మించిన వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2024-09-26 03:14 GMT

Gold prices today

బంగారం ధరల్లో పెరుగుదల భారీగా ఉంది. వెండి ధరలు కూడా ప్రియంగానే మారుతున్నాయి. రెండు వస్తువులు అత్యంత విలువైన వస్తువులగా మారిపోయాయి. సీజన్ మొదలు కాకముందే ధరలు పెరుగుతుండటంతో ఇక పండగలు, పెళ్లిళ్ల సీజన్ ఆరంభమయితే ధరలు ఎలా పెరుగుతాయోనన్న ఆందోళన కొనుగోలుదారుల్లో ఉంది. ఇప్పటికే బంగారం ధర 77 వేల రూపాయలను దాటేసింది. కిలో వెండి ధర లక్ష రూపాయలకు మించి పలుకుతుంది. దీంతో పెళ్లిళ్లు, పండగలకు బంగారం, వెండి కొనుగోలు చేయడంపై వినియోగదారుల్లో సందిగ్దం నెలకొంది. ఇప్పుడు కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో పడిపోయారు.

పెరిగిన ధరలకు తోడు...
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగానే తగ్గుతుండటంతో వినియోగదారులు సంతోషపడ్డారు. ఇంకా తగ్గుతాయని ఆశించారు. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌ టైం రికార్డు ధరకు బంగారం, వెండి చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే బంగారం ధరపై దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది. ఇంత భారీ పెరుగుదల ఇటీవల కాలంలో లేకపోవడంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. పసిడిని కొనుగోలు చేయాలని జ్యుయలరీ దుకాణాలకు వెళ్లిన వాళ్లు రేట్లు చూసి వెనక్కు వస్తున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
భారీగా పెరిగి...
పెరిగిన ధరలకు తోడు జీఎస్‌టీ, తరుగు అంటూ మరికొంత వ్యాపారులు బాదేస్తుండటంతో అసలు ధరకు మించి ఎక్కువ రేట్లు జ్యుయలరీ దుకాణాల్లో కనపడుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 77,030 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 1,01,000 రూపాయలు పలుకుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మళ్లీ మార్పులుండే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News