Gold Price Today : షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు అంతే. స్వల్పంగా తగ్గి కొనుగోలు చేసేందుకు రా రమ్మంటూ ఊరించి మరీ పెరుగుతాయి. పసిడికి ఉన్న గిరాకీ అలాంటిది. అందులోనూ శ్రావణమాసం చివరకు రావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని ముందుగానే ఊహించిందే. మార్కెట్ నిపుణులు కూడా అదే అంచనా వేశారు. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ మనం అనుకున్న స్థాయిలో తగ్గవు. అదే పరిస్థితుల్లో మనం ఊహించని స్థాయిలో బంగారం ధరలు పెరుగుతాయి. దీనికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
కొనుగోలు చేయాలంటే...
పసిడి కొనుగోలు చేయడం ఇప్పుడు ఆషామాషీ విషయం కాదు. అందుకే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు తమకు అవసరమైనప్పుడు మాత్రమే కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇక సంపన్నుల విషయానికి వస్తే పెట్టుబడుల కోసం బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. స్టేటస్ సింబల్ గా భావిస్తుండటంతో అత్యధికంగా బంగారు ఆభరణాల విక్రయాలు జరుగుతున్నాయి. జ్యుయలరీ దుకాణాలు కూడా దక్షిణ భారతదేశంలో విచ్చలవిడిగా పెరిగాయి. కొత్త కొత్త డిజైన్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలకు ఈఎంఐ సౌకర్యం కూడా ఉండటంతో దానిని ఉపయోగించుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు.
వెండి మాత్రం...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. దసరా పండగ వరకూ మంచి ముహూర్తాలు లేకపోవడంతో ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,160 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,260 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 93,400 రూపాయలుగా నమోదయింది.