Gold Price Today : మగువలకు షాకిచ్చిన పసిడి.. ధర ఎంత పెరిగిందో తెలిస్తే?

ఇక దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

Update: 2024-08-22 03:18 GMT

బంగారం ధరలు తగ్గుతాయని సంబరపడినన్ని రోజులు లేవు. వాటి పరుగును ఎవరూ ఆపలేరు. ఎందుకంటే వాటి పెరుగదలకు అనేక కారణాలుంటాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో పాటు దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ బంగారం ధరలు పెంచుకుంటూ పోతాయి. ఎందుకంటే అది అత్యంత విలువైన వస్తువుగా మారింది. రాజు నుంచి పేద వరకూ బంగారాన్ని కావాలనుకుంటున్నారు. తమ సొంతం చేసుకోవాలని భావిస్తారు. అందుకే పసిడి ధరలు ఎప్పుడూ పెరిగినా భారీగా పెరుగుతాయి. తగ్గితే అతి స్వల్పంగా తగ్గుతాయి. అందులోనూ ఇక సీజన్ లో పుత్తడి ధరలు పెరగకుండా ఉంటాయనుకోవడం అత్యాశే అవుతుంది.

కష్టకాలంలో...
పసిడి అనేది ఇప్పుడు అవసరమైన వస్తువుగా మారింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం కూడా ఇందుకు కారణం. బంగారాన్ని తమ వద్ద ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బుకు సరిపడా పసిడిని కొనుగోలు చేసుకోవచ్చు. మిగిలిన వస్తువులు అలా కాదు. దీంతో పాటు బంగారం ఉంటే భవిష్యత్ కు భద్రత ఉంటుందని అనేక మంది నమ్ముతారు. వ్యాపారాల్లో నష్టం మొచ్చినా, ఉపాధి కోల్పోయినా బంగారం మన వద్ద ఉంటే అది ఆదుకునే అవకాశం ఉంటుంది. పైగా అమ్మే వీలు లేకుండా కుదువ పెట్టి తాత్కాలికంగా కష్టాల నుంచి బయటపడే వీలుంది. కరోనా వంటి కష్ట సమయాల్లోనూ పసిడి అనేక మందిని ఆదుకుంది.
భారీగా పెరిగి...
ఇక దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. గత రెండు రోజుల్లో బంగారం ధర పది గ్రాముల పై వెయ్యి రూపాయలు పెరిగిందంటే శ్రావణ మాసం ఎఫెక్ట్ అని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,200 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 91,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News