Gold Prices : ధన్‌తెరాస్ ముందు రోజు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన బంగారం

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి

Update: 2023-11-10 02:23 GMT

సాధారణంగా ధన్‌తెరాస్ రోజుకు బంగారం ధరలు పెరుగుతాయి. దీపావళి వస్తుందంటే బంగారం కొనుగోలు చేయడం ఎక్కువగా ఉంటుంది. ధరలు పెరిగినా డిమాండ్ ఎక్కువగా ఉండే వస్తువు ఒకటే ఒక్కటి బంగారం. అందుకే బంగారానికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. పసిడి కొనుగోలు దారులు భయపడుతున్నట్లు ఈసారి ధన్ తెరాస్ కు బంగారం ధరలు పెగరకపోగా భారీగా తగ్గడంతో కొనుగోలు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జ్యుయలరీ దుకాణాలు కిటికిటలాడిపోతున్నాయి.

సెంటిమెంట్ తో...
ధన్‌తెరాస్ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిదన్న సెంటిమెంట్ బలంగా ఉంది. తమ స్థోమతను బట్టి చిన్న పాటి గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఆరోజు బంగారాన్ని కొనుగోలు చేసి లక్ష్మీదేవి ఎదుట ఉంచి పూజలు చేస్తే మంచిదని విశ్వసిస్తారు. అందుకే ఏటా ధన్ తెరాస్ రోజు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. పైగా పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో బంగారం ధరలకు ఇక రెక్కలు వస్తాయని అందరూ భావించారు. కానీ బంగారం ధరలు తగ్గడం ఆనందదాయకమే.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.400లు తగ్గింది. కిలో వెండి ధర పై రూ.300లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,760 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర భారీగా తగ్గి ప్రస్తుత మార్కెట్ లో 76,200 రూపాయలుగా ఉంది. సో ధన్‌తెరాస్ రోజు బంగారం కొనుగోలు చేసే వారికి ఇది శుభవార్త కాక మరేముంటుంది?


Tags:    

Similar News