ఈ టాప్ బ్రాండ్ల నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాము. ముందు స్కూటర్లు రోడ్లపైకి ఎక్కగా, టాటా ఇతర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు కూడా వచ్చేశాయి. కొన్ని కార్ల తయారీ కంపెనీలో కొత్త ఏడాదిలో పలు మోడళ్ల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ జాబితాలో మారుతి సుజుకీ, మహీంద్రా, టాటా వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి.
టాటా హారియర్..
భారతీయ ఈవీ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా మరో ఈవీ కారును తీసుకురానుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో త్వరలో హారియర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీల రేంజ్‌ను అందించగలదని భావిస్తున్నారు.
మారుతి సుజుకీ ఈవీఎక్స్..
మారుతి సుజుకీ నుంచి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. మారుతి సుజుకీ ఈవీఎక్స్ పేరిట ఎలక్ట్రిక్ SUV తీసుకురానుంది. దీనిలో 60కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్ పై దాదాపు 550కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని చెబుతున్నారు.
టాటా పంచ్ ఈవీ..
కస్టమర్లు అత్యంత ఆసక్తి ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఒకటి టాటా పంచ్ ఈవీ. టాటా అల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ మన దేశంలో అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ SUVగా నిలువనుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 315 కిమీల మైలేజీ ఇస్తుందని చెబుతున్నారు.
బీవైడీ ఎలక్ట్రిక్ సెడాన్..
చైనాకు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు బీవైడీ మన దేశంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. రెండు బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల పరిధి వరకు వస్తుందని సమాచారం. కేవలం 3.8సెకండ్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది.
మహీంద్రా ఎక్స్ యూవీ 300..
ఇక మార్కెట్లో మహీంద్రా నుంచి కూడా నెక్సాన్ ఈవీకి పోటీగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా ఎక్స్ యూవీ300ను విడుదలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇంకా బయటకు రాకపోయినా.. ఎక్స్ యూవీ 400 కన్నా బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంటుందని మాత్రం చెబుతున్నారు.