అక్టోబర్‌ 24 నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ సేవలు బంద్‌

వాట్సాప్‌.. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఉద్యోగుల..

Update: 2023-10-23 07:39 GMT

వాట్సాప్‌.. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు దీనిని ఉపయోగించని వారంటూ ఉండరేమో. అయితే వాట్సాప్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే వాట్సాప్‌లో కొత్త కొత్త అప్‌డేట్స్‌ వచ్చేస్తున్నారు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేస్తోంది. అయితే కొన్ని ఫోన్‌లలో రేపటి నుంచి అంటే అక్టోబర్‌ 24వ తేదీ నుంచి వాట్సాప్‌ను పని చేయదు.

వాట్సాప్‌ తన రెగ్యులర్‌ అప్‌డేట్స్‌ భాగంగా అక్టోబర్‌ 24 నుంచి కొన్ని కొన్ని రకాల ఫోన్స్‌కు తన అప్‌డేట్స్‌ నిలిపేస్తున్నట్లు వాట్సాప్‌ సంస్థ ప్రకటించింది. వాట్సాప్‌ నిర్ణయంతో దాదాపు 18 స్మార్ట్‌ఫోన్స్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. అంటే ఆ ఫోన్స్‌లో వాట్సాప్‌ ఇక ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వదు. ముఖ్యంగా ఆ ఫోన్స్‌కు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఉండవు కాబట్టి ఆ ఫోన్స్‌లో వాట్సాప్‌ వినియోగించవద్దని వాట్సాప్‌ ప్రతినిధులు కోరుతున్నారు.

కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్‌ సర్వీసులను నిలిపివేయనుంది. వాట్సాప్ రీసెంట్ టైమ్‌లో మరింత అడ్వాన్స్‌డ్‌ ఫోన్లు, సాఫ్ట్‌వేర్‌లలోనే పని చేసే కొత్త ప్రైవసీ ఫీచర్లను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న పాత ఫోన్లలో ఈ ఫీచర్లు పని చేయదు. అందుకే ఇక నుంచి పాత ఫోన్‌లలో వాట్సాప్ ఉపయోగించడం కురదు. వారికి సెక్యూరిటీ రిస్క్‌ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఆ కారణంగా అక్టోబర్ 24 తర్వాత వాట్సాప్ ఈ ఫోన్లకు సపోర్ట్ అందించడాన్ని నిలిపియాలని నిర్ణయించింది. కొత్త OSలకు అప్‌గ్రేడ్ కావాలని వాట్సాప్ సూచించింది.

ఏయే ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌

శామ్‌సంగ్ గెలాక్సీ S2: ఈ మొబైల్‌ 2011లో శామ్‌సంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఇందులో 4.3-అంగుళాల స్క్రీన్, 8-మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి.

HTC వన్: 2013లో విడుదలైన ప్రీమియం ఫోన్ హెచ్‌టీసీ వన్ 4.7-అంగుళాల స్క్రీన్, 4-మెగాపిక్సెల్ కెమెరా, క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది.

సోనీ ఎక్స్‌పీరియా Z: ఇది 2013లో సోనీకి చెందిన వాటర్‌ప్రూఫ్ ఫోన్. ఇందులో 5-అంగుళాల స్క్రీన్, 13-మెగాపిక్సెల్ కెమెరా, క్వాడ్-కోర్ ప్రాసెసస్‌తో వచ్చింది.

శామ్‌సంగ్ గెలాక్సీ S: ఇది 2010లో శామ్‌సంగ్ నుంచి వచ్చిన మొదటి గెలాక్సీ ఫోన్. అక్టోబర్ 24 తర్వాత వాట్సాప్ ఉపయోగించాలనుకునేవారు ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడం మంచిది.

HTC డిజైర్ HD: 2010లో విడుదలైన హెచ్‌టీసీ డిజైర్ హెచ్‌డీ ఫోన్ 4.3-అంగుళాల స్క్రీన్, 8-మెగాపిక్సెల్ కెమెరా, సింగిల్-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది.

మోటారోలా Xoom: ఇది 2011లో రిలీజైన టాబ్లెట్. ఇందులో 10.1-అంగుళాల స్క్రీన్, 5-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్‌ 10.1: 2011లో శామ్‌సంగ్ నుంచి వచ్చిన ఈ ట్యాబ్లెట్‌లో కూడా వాట్సాప్ పని చేయదు.

నెక్సస్ 7: 2012లో గూగుల్ విడుదల చేసిన నెక్సస్ ట్యాబ్లెట్ ఇది.

ఈ ఫోన్లు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందలేనంత పాతవి అయ్యాయి. అందుకే ఈ ఫోన్లకు వాట్సాప్‌ పని చేయదు. ఈ ఫోన్‌లకు హ్యాకర్ల ప్రమాదం ఉన్నందున ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

Tags:    

Similar News