Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్‌గా..

టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో సదుపాయాలన్ని సులభతరం అవుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక ఎన్నోరకాల సేవలు అందుబాటులోకి

Update: 2024-03-21 14:40 GMT

whatsapp

టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో సదుపాయాలన్ని సులభతరం అవుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక ఎన్నోరకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంట్లోనే ఉండి కూడా చేసుకునే సదుపాయం వచ్చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు వచ్చిన తర్వాత సమాచారం మార్పిడి సులభతరం అయింది. తాజాగా వాట్సాప్‌లో సుదీర్ఘ సందేశం పంపాలంటే ఆడియో వాయిస్ సందేశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వాయిస్ నోట్ అందగానే వెంటనే అది ప్లే చేసి వినలేని పరిస్థితులు ఉంటాయి. దీనికి పరిష్కారం కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ రెడీ చేస్తున్నట్లు వాట్సాప్‌ సంస్థ తెలిపింది.

వాయిస్‌ నోట్‌:

వాయిస్ నోట్ ట్రాన్స్ స్క్రిప్షన్ పేరుతో వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వాయిస్‌తో మెసేజ్‌ను టెక్ట్స్‌గా మార్చుకునే వీలుంటుంది. ఫలితంగా నోట్ వినకుండానే మెసేజ్ చదివి తిరిగి రిప్లయ్ ఇవ్వవచ్చు. ఇప్పటికే కొందరు ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ వచ్చే అవకాశం ఉంది.కొత్త ఫీచర్ కోసం యూజర్లు అదనంగా 150 ఎంబీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. వాయిస్ నోట్స్ టెక్ట్స్ లోకి మార్చడానికి డివైజ్ స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్లను వాట్సాప్ వాడుకోవడంతో ట్రాన్స్‌స్క్రిప్షన్ డివైజ్‌లోనే జరుగుతుందని, యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాబీటా ఇన్ఫో పేర్కొంది.

ఇదిలా ఉండగా, స్టేటస్ అప్‌డేట్‌లలో 1 నిమిషం నిడివి ఉన్న వీడియోలను పోస్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ప్రస్తుతం, వినియోగదారులు స్టేటస్‌ పెట్టుకోవాలంటే కేవలం 30-సెకన్ల వీడియోలకు పరిమితం మాత్రమే ఉంది. పొడవైన వీడియోలను చిన్న క్లిప్‌లుగా విభజించడం అవసరం. ఇది ఎప్పుడు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది? అనేది ఇంకా తెలియరాలేదు. 

Tags:    

Similar News