గూగుల్‌ షాకింగ్‌ న్యూస్‌.. Gmail అకౌంట్స్‌ డిలీట్‌.. మీది ఉందా? చెక్‌ చేసుకోండి

Gmail అకౌంట్స్‌ అనేవి ఈ రోజుల్లో చాలా మందికే ఉంటుంది. ఈ Gmail ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది..

Update: 2023-12-05 15:09 GMT

Gmail అకౌంట్స్‌ అనేవి ఈ రోజుల్లో చాలా మందికే ఉంటుంది. ఈ Gmail ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వినియోగిస్తున్నారు. జీమెయిల్‌ 2004లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అకౌంట్ల సంఖ్య కోట్లాదిగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమ క్రమంగా పరిధి పెంచుకుంటూ పోయింది గూగుల్‌. జీమెయిల్‌ అకౌంట్ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు చాలా మంది జీవితంలో జీమెయిల్‌ అనేది ఒక భాగమైపోయింది. యూట్యూబ్‌ ఛానల్స్‌కు, ఫోటోలకు, ఉద్యోగంలో ఇలా ఒక్కటేమిటి చాలా వాటికి జీమెయిల్‌ అకౌంట్‌ తప్పనిసరి అయిపోయింది.

ప్రస్తుతం రోజుకు లక్షల్లో కొత్త అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్‌ అకౌంట్స్‌ ఉంటున్నాయి.అందులో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. చాలా మందికి తాము క్రియేట్‌ చేసిన కొన్ని ఇమెయిల్‌ వాడకుండా అలాగే ఉండిపోయినవి కూడా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాడకుండా ఉన్న జీమెయిల్స్‌ అకౌంట్లపై గూగుల్‌ ఫోకస్‌ పెట్టింది. తాజాగా గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్టివ్‌గా లేని అకౌంట్లపై కన్నేసింది. వాటిని డిలీట్‌ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న జీమెయిల్‌ అకౌంట్లను డీలిట్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం జీమెయిల్‌ అకౌంట్లు యాక్టివ్‌గా ఉండాలని అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఎలాంటి అకౌంట్స్‌ డిలీట్‌ అవుతాయి?

ఈ Gmail Accounts డిలీట్‌ అవుతాయన్న వార్తలు విన్న తర్వాత చాలా మందిలో టెన్షన్‌ మొదలైంది. మరి అందరి అకౌంట్స్‌ డిలీట్‌ అవుతాయా? అంటే అలాంటిదేమి లేదు. కనీసం రెండు సంవత్సరాలుగా జీమెయిట్‌ అకౌంట్‌ వాడని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను మాత్రమే గూగుల్‌ డిలీట్‌ చేయనుంది. డిసెంబర్‌ 1 వరకు రెండేళ్లుగా వాడని అకౌంట్లను డిలీట్‌ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ కూడా డిసెంబర్‌ 1 నుంచే ప్రారంభించింది. గూగుల్‌. ఈ డిలీట్‌ చేసే విధానం విడతల్లో జరుగనుంది.

డిలీట్‌ చేయడానికి కారణాలు ఏమిటి?

తాము జీమెయిల్స్‌ను ఎందుకు డిలీట్‌ చేయడానికి గల కారణాలను గూగుల్‌ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. చాలా మంది వినియోగదారులకు ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్ ఖాతాలు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే వారు వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి అకౌంట్లను స్కామర్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, వెరిఫికేషన్‌ లేకపోవడం వల్ల నిరుపయోగంగా ఉన్న అకౌంట్‌లు భద్రతా ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉందని గూగుల్‌ ఇంటర్నల్‌ అనాలసిస్‌ వెల్లడించింది. ఇలాంటి అకౌంట్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, అందుకే వాడని అకౌంట్లను డిలీట్‌ చేస్తున్నామని గూగుల్‌ వెల్లడించింది.

Tags:    

Similar News