WiFi: మీ ఇంట్లో వైఫై సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి మరింత స్పీడ్‌గా..

చాలా మంది ఇండ్లల్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో రూటర్‌ నుంచి వైఫై సరిగ్గా రాదు. ఎంత..

Update: 2024-03-04 06:52 GMT

wifi

చాలా మంది ఇండ్లల్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో రూటర్‌ నుంచి వైఫై సరిగ్గా రాదు. ఎంత ప్రయత్నించినా ఇంటర్‌నెట్‌ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇంట్లో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైళ్లకు వైఫై వాడుతుంటాము. కానీ స్పీడ్‌ బాగా తగ్గిపోతుంటుంది. వైఫై మెరుగ్గా వచ్చేందుకు రూటర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా సినిమాలు, ఇంత వాటికి నెట్‌ను వాడేటప్పుడు మాటిమాటికి డిస్‌కనెక్ట్‌ అవుతుంది. అలాంటి సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ కొన్ని ట్రిక్స్‌ పాటించడం వల్ల వైఫై సదుపాయాన్ని వేగవంతం చేసుకోవచ్చు.

రూటర్ సమస్యలను ఎలా పరిష్కరించాలి?

వైఫై సరిగ్గా రాకుంటే రూటర్లో సమస్య ఉన్నట్లు. రూటర్‌కు ఉండే యాంటెన్నా వల్ల కావచ్చు. అలాంటి సమయంలో ముందుగా ప్రతిరోజూ రూటర్‌ని 10 నిమిషాల పాటు ఆఫ్‌లో ఉంచండి. అయినా సమస్య అలాగే కొనసాగితే, రూటర్ యాంటెన్నాను మార్చాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. రూటర్‌ దగ్గర బ్లూటూత్ వంటి పరికరాలను ఉంచవద్దు. అవసరమైతే మీరు రూటర్‌ను వేరే ప్రాతంలో అమర్చి చూడాలి.

గోడకు వేలాడదీయడం:

మీరు పనిచేసే గదిలో రూటర్‌ను ఉంచడం మంచిది. మీరు ఒక గదిలో పని చేస్తూ వేరే గదిలో రూటర్‌ ఉంచినా నెట్‌ సరిగ్గా రాకపోవచ్చు. లేదా రూటర్‌ను గోడకు వేలాడదీసేలా చేయడం. రూటర్‌ ఎత్తులో ఉంటే నెట్‌ స్పీడ్‌గా వస్తుంది.

రూటర్‌ యాంటెన్నాలను వేర్వేరు దిశల్లో ఉంచడం వల్ల వైఫై స్పీడ్‌గా రావచ్చు. తద్వారా రేడియో సిగ్నల్ ఇంట్లోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. కానీ సమస్య అలాగే కొనసాగితే మీ రూటర్‌ని రీసెట్ చేయడం మంచిది.

Tags:    

Similar News