Xiaomi EV: స్మార్ట్‌ఫోన్‌ సంస్థ షియోమీ నుంచి ఎలక్ట్రిక్‌ కార్లు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపాయి. దీంతో

Update: 2024-03-26 10:18 GMT

Xiaomi EV

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల కార్లు, ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్‌ రూపంలో వచ్చాయి. వానదారులు కూడా ఈవీ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇక చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అడుగుపెట్టబోతోంది. తన తొలి ఈవీ మాడల్‌ను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ సీఈవో లియో జున్‌ ప్రకటించారు. ఈ ఈవీ వాహనాలు రెండు మోడళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రెండు రకాల్లో తొలి ఎలక్ట్రిక్‌ వాహనమైన ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ మాడళ్లు ఉన్నాయి. ఈ మాడల్‌ ధర 5 లక్షల యూవాన్‌ (69,424 డాలర్లు) లోపు ఉంటుందని తెలుస్తోంది.

ఈ మాడళ్లలో 73.6 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 668 కిలోమీటర్లు, 101 కిలోవాట్ల బ్యాటరీ 800 కిలోమీటర్లు ప్రయాణించేలా రూపొందించనున్నారు. ఈ వాహనాన్ని డిసెంబర్‌లోనే ప్రదర్శించింది. వచ్చే పది సంవత్సరాలలో ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 10 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు షియోమీ తెలిపింది.

వాహనాల ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

➦ కేవలం 2.78 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం.

➦ ఎస్‌యూ7 మ్యాక్స్‌ మాడల్‌ గంటకు 265 కిలోమీటర్లు మైలేజీ

➦ 5.28 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోసున్న ఎస్‌యూ౭

➦ గంటకు 210 కిలోమీటర్ల దూరం వెళ్లనుంది.

➦హై-టెక్నాలజీ ఫీచర్‌తో రూపొందించిన ఈ మాడల్‌లో పార్కింగ్‌ అసిస్టెన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్‌, 25-స్పీకర్‌ సిస్టమ్‌, కనెక్టివిటీ ఆప్షన్‌ ఎంచుకోవచ్చును. ఇవే కాకుండా మరిన్ని అత్యాధునిక ఫీచర్స్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News