బ్రేకింగ్ : హోటల్ లోకి దూసుకెళ్లిన కంటైనర్.. 10 మంది మృతి
మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి..
ముంబై- ఆగ్రా హైవేపై పలాస్నర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. కంటైనర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో.. అతివేగంతో ఆ కంటైనర్ ఓ హోటల్ లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి పైగా గాయపడగా.. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలం మహారాష్ట్రలోని ధులే జిల్లా షిర్పూర్ తహసీల్ లో మధ్యప్రదేశ్ కు ఆనుకుని ఉంది.
ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరును బట్టి మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు. కంటైనర్ హైవేపై అతివేగంతో వెళ్తుండగా.. బ్రేక్ ఫెయిల్ అయిందని, అది రోడ్డు పక్కనే ఉన్న హోటల్ వద్ద పార్కింగ్ చేయబడిన వాహనాలను ఢీ కొట్టి హోటల్ లోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.