8 ఏళ్ల బాలుడు తన 2 ఏళ్ల తమ్ముడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని

పూజారామ్ జాతవ్ రెండేళ్ల కొడుకు రాజా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో చిన్నారిని మోరెనా జిల్లా

Update: 2022-07-11 06:24 GMT

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో 8 ఏళ్ల బాలుడు తన 2 ఏళ్ల తమ్ముడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని కూర్చున్న హృదయ విదారక దృశ్యం కనిపించింది. పిల్లల తండ్రి పూజారామ్ జాతవ్ చనిపోయిన తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో రోడ్డుపక్కన మృతదేహంతో కూర్చున్నాడు చిన్నారి.ఈ సంఘటన మొరెనా జిల్లాలోని అంబాహ్ పరిధిలోని బడాఫ్రా గ్రామంలో నివేదించబడింది.

పూజారామ్ జాతవ్ రెండేళ్ల కొడుకు రాజా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో చిన్నారిని మోరెనా జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూజారామ్‌తో పాటు అతని పెద్ద కుమారుడు గుల్షన్ (8 సంవత్సరాలు) కూడా ఆసుపత్రికి వచ్చాడు. అయితే మోరీనా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజా మృతి చెందాడు. నిరుపేద, నిస్సహాయుడైన పూజారాం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారుల ముందు వేడుకున్నాడు. అధికారులు తండ్రి డిమాండ్‌ను తిరస్కరించారు. ఆసుపత్రి అధికారులు అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో, వ్యక్తి తన బిడ్డ మృతదేహంతో ఆసుపత్రి నుండి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చున్నాడు. పంక్చర్‌ షాప్‌ నడుపుతున్న పూజారాం జాతవ్‌కు మరో వాహనం ఏర్పాటు చేయడానికి డబ్బులు కూడా సరిపోలేదు. అతను తన పెద్ద కొడుకు గుల్షన్‌ చేతిలో రాజా మృతదేహం పెట్టి డబ్బుల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. గుల్షన్ తన తండ్రి తిరిగి వస్తాడని తమ్ముడిని ఒడిలో పెట్టుకుని అరగంటపాటు ఆసుపత్రి ముందు కూర్చున్నాడు.


Tags:    

Similar News