8వ తరగతి బాలుడిని కొట్టిచంపిన విద్యార్థులు

దేశరాజధానిలోని బదర్ పూర్ ప్రాంతంలోని కాలువలో గురువారం(ఏప్రిల్ 27) రాత్రి పోలీసులకు స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థి..;

Update: 2023-04-29 05:16 GMT
8th class boy killed by friends

8th class boy killed by friends

  • whatsapp icon

విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయసులో విద్యార్థులు చేయరాని పనులు చేసి నేరస్తులై జైలుకు వెళ్తున్నారు. తాజాగా ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని తోటి విద్యార్థులే కొట్టి చంపేశారు. దేశరాజధానిలోని బదర్ పూర్ ప్రాంతంలోని కాలువలో గురువారం(ఏప్రిల్ 27) రాత్రి పోలీసులకు స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థి మృతదేహం లభించింది. పక్కనే స్కూల్ బ్యాగ్ కూడా ఉండటంతో.. అందులో ఉన్న పేరు, ఇతర ఆధారాలను బట్టి బాలుడి వివరాలను సేకరించారు.

మృతుడు మోలడ్ బంద్ బిలాస్ పూర్ క్యాంప్ కు చెందిన సౌరభ్ గా గుర్తించారు. బాలుడి మృతిపై పోలీసులు విచారణ జరుపగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సౌరభ్ స్నేహితులు ఇద్దరు తమ స్కూల్ సమీపంలో సిగరెట్ తాగుతూ అతడి కంట పడ్డారు. మీ ఇద్దరిపై టీచర్ కు ఫిర్యాదు చేస్తా అని సౌరభ్ స్నేహితులను హెచ్చరించడంతో.. వారిద్దరూ సౌరభ్ ను తీవ్రంగా కొట్టి చంపేశారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ కు తరలించారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.


Tags:    

Similar News