కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.;

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. లారీ ఢీకొని ఐదుగురు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లా జీవర్గి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయ్యాయని పోలీసులు తెలిపారు.
19 మందికి గాయాలు...
వెంటనే పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వీరంతా హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులంతా బాగల్ కోటకు చెందినవారని , మృతులు మెహబూబ్, మహబూబ్, వాజిద్, మాలన్, ప్రియాంకలుగా పోలీసులు గుర్తించారు.