నవ్వుతూ ఆమెతో ఫోటో.. కొన్ని గంటల తర్వాత అతడేమైపోయాడంటే
కొన్ని గంటల ముందు "కుటుంబం" అనే క్యాప్షన్‌తో మహిళ, ఆమె కొడుకుతో ఉన్న ఫోటోను
కోల్‌కతాలో 32 ఏళ్ల వ్యక్తిని అతడితో రిలేషన్ షిప్ లో ఉన్న మహిళ చంపేసింది. తన లైవ్-ఇన్ భాగస్వామిని కత్తితో పొడిచి చంపేసిందామె. అతని మరణానికి కొన్ని గంటల ముందు "కుటుంబం" అనే క్యాప్షన్‌తో మహిళ, ఆమె కొడుకుతో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. అందులో అతడు నవ్వుతూ కనిపించాడు. సంహతి పాల్ అనే మహిళకు గతంలోనే వేరే వ్యక్తితో విడాకులు తీసుకుంది. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. ఆమె ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్.. సార్థక్ దాస్ అనే ఫోటోగ్రాఫర్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. దాస్ సోషల్ మీడియా ఖాతాలో సంహతి పాల్, ఆమె కొడుకుతో ఉన్న అనేక చిత్రాలు ఉన్నాయి.
దాస్ కు , సంహతి జీవితంలో గత కొన్ని రోజులుగా సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు గొడవపడుతూ ఉన్నారు. బుధవారం దాస్‌ను పదునైన కత్తితో పలుమార్లు సంహతి పొడిచింది. ఈ దాడి చేసిన తర్వాత ఆమెనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసు బృందం డమ్‌డమ్ ప్రాంతంలోని పాల్ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. సార్థక్ దాస్ శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి.. రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. విచారణలో సంహతి పాల్ నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు.ఆమె అతడ్ని చంపడానికి కారణం ఏమిటా అనే విషయమై పోలీసులు ఆరాతీస్తున్నారు.