మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
మహారాష్ఠ్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగూర్ లోని ఉమ్రెడ్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది;

మహారాష్ఠ్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగూర్ లోని ఉమ్రెడ్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకూ మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నాగపూర్ లోని ఉమ్రేడ్ ప్రాంతంలో ఉన్న అల్యుమినియం ఫాయిల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించింది.
పేలుడు కారణంగానే...
ఈ పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనమయ్యారని చెబుతున్నారు. పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.