Breaking : ఎల్బీనగర్ లో దారుణం... మహిళపై కత్తులతో దాడి
ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. మహిళపై కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు.;

ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. మహిళపై కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మి అనే మహిళలను కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆమె కత్తిపోట్లకు గురయ్యారు. ఆమె ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
గత ఏడాది తన కుమార్తె వివాహానికి...
గత ఏడాది లక్ష్మి తన కుమార్తె వివాహం సందర్భంగా డబ్బులు తీసుకుని వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. తనను చిత్రహింసలు పెట్టారని లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లక్ష్మిపై ఎవరు దాడి చేసిందన్న దానిపై ఇంకా వివరాలు అందలేదు. ఒంటరిగా వెళుతన్న మహిళ లక్ష్మిపై దుండగులు దాడి చేయడంతో గాయపడి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.