హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు

హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. స్కోడా కారు ఒక బైకును ఢీకొట్టడంతో బీ ఫార్మసీ యువతి అక్కడికక్కడే మరణించింది;

Update: 2025-04-11 03:55 GMT
hit and run case, woman  died , car, hyderabad
  • whatsapp icon

హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. స్కోడా కారు ఒక బైకును ఢీకొట్టడంతో బీ ఫార్మసీ యువతి అక్కడికక్కడే మరణించింది. కోహెడ్లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడా వద్ద బైక్ ను ఢీకొట్టి కారుతో పారిపోతుండగా చైతన్యపురి వద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

యువతి మృతి...
కోహెడ వద్ద బైక్ ను ఢీకొట్టిన ప్రదీప్ వర్మ పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పట్టుకోగలిగారు. కారు అద్దం పగిలడంతో ఆపిన చైతన్య పురి పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వర్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో చివరకు హిట్ అండ్ రన్ కేసు అని గుర్తించారు. తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ మద్యం తాగి కారును నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడు సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News