Telangana : సైకో గాడున్నాడు.. మహిళలూ జాగ్రత్త.. మాటలు చెప్పి చంపేస్తాడు

పది మంది మహిళలను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;

Update: 2025-04-12 04:14 GMT
police, arrested, women, murder
  • whatsapp icon

కరడు గట్టిన నేరగాడు.. ఏకంగా పది మంది మహిళలను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా పోలీసుల కథనం ప్రకారం మహిళలతో మాటలు కలిపి వారి చేత కల్లు తాగించి చంపేయడం ఈ సైకోగాడికి హాబీ. నిందితుడిని డప్పు గోపాల్ గా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం వెళ్లిన నర్సాపూర్ మండలం జయరాం తండాకు చెందిన భుజాలీ అనే మహిళ అదృశ్యం కావడంతో పోలీసు కేసు నమోదయింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. కేవలం భుజాలీ మాత్రమే కాదు మరో పది మంది మహిళలు డప్పు గోపాల్ చేతిలో హతమయ్యారని తెలుసుకున్న పోలీసులు సైకో గోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు.

మాయమాటలతో నమ్మించి...
డప్పుగోపాల్ ఇప్పటికే సంగారెడ్డి కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో పది మంది మహిళలను హత్య చేసినట్లు గుర్తించారు. పలు కేసుల్లో డప్పు గోపాల్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. బలమైన క్రైమ్ ట్రాక్ రికార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను ప్రధానంగా కల్లు దుకాణాలు, కూలీ అడ్డాల వద్ద మాటువేసేవాడు. తర్వాత మహిళలతో మాట కలుపుతూ వారిని నమ్మించేవాడు. తనతో పాటు కల్లు తాగేందుకు తీసుకెళ్లేవాడు. కవారి చేత కల్లు తాగించి తర్వాత వారు మత్తులో ఉండగా హత్య చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను దోచుకు పోయేవాడు. కొందరు మహిళలపై అత్యాచారానికి డప్పు గోపాల్ పాల్పడ్డారని కూడా మెదక్ ఎస్సీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సీసీ కెమెరాల పరిశీలనలో...
మహిళ అదృశ్యమైన కేసులో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు భుజాలీ అనే మహిళ డప్పు గోపాల్ తో ఆటోలో వెళుతున్నట్లు కనిపించింది. మెదక్ మార్గంలోని ఒక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడ భుజాలీ మృతదేహాన్ని గుర్తించారు. డప్పు గోపాల్ ను పాత నేరగాడిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించగా నర్సాపూర్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకని పోలీసులు తమ స్టయిల్ లో విచారించగా తాను హత్య చేసినట్లు డప్పు గోపాల్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. డప్పు గోపాల్ 2005 నుంచి ఇప్పటి వరకూ మొత్తం పది మంది మహిళలను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News