రాయచోటిలో ఘోరం.. బాలికపై అత్యాచారం

యచోటి పట్టణంలోని ఒక కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్న ఇబ్నేజర్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు;

Update: 2022-07-01 04:17 GMT

అన్నమయ్య జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఒక బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. రాయచోటి పట్టణంలోని ఒక కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్న ఇబ్నేజర్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పదో తరగతి చదువుతోంది. ఇటీవల వచ్చిన ఫలితాలలో రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయింది.

కోచింగ్ కు వచ్చిన....
దీంతో ఆ బాలిక రెండు సబ్జెక్ట్ లలో ట్యూషన్ కోసం కోచింగ్ కు వెళుతుంది. కోచింగ్ కు వచ్చిన విద్యార్థినిపై ఇబ్నేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీసులు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఇబ్నేజర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News