Road Accident: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి
రాయచోటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.;

అన్నమయ్య జిల్లా, రాయచోటి: రాయచోటి-చిత్తూరు రహదారిపై సంబేపల్లె సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఇరుక్కుపోయిన రమాదేవిని స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. వెంటనే రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.