సినీనటి చౌరాసియా కేసులో కొత్త కోణం
నటి చౌరాసియా కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. చౌరాసియా పట్ల గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది.;
నటి చౌరాసియా కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. చౌరాసియా పట్ల గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. కేబీఆర్ పార్క్ వద్ద ఆదివారం రాత్రి వాకింగ్ కు వెళ్లిన నటి చౌరాసియా పై దాడి చేసి ఫోన్ లాక్కుని వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడు పొదల్లోకి లాక్కుని వెళ్లి...
చౌరాసియా పై దాడి చేసిన నిందితుడిని పట్టుకునేందుకు మొత్తం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. చౌరాసియాను పొదల్లోకి లాక్కుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీసులు గుర్తించారు. ఇది సైకో పని అయిఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.